Hijab Row: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు.
కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను తాకింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఒక పాఠశాలలో హిజాబ్, నామబలి(కాషాయ వస్త్రాలు) ధరించ రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్రానికే మాత్రం పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్న తీర్పును వెలువరించింది.
Supreme Court Order Likely Tomorrow on Karnataka Hijab Ban:కర్ణాటకలో ప్రభుత్వ హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే…
దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం.. అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక…