Hyderabad Hijab Row: హైదరాబాద్ స్కూల్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థినిని ఇంటికి పంపిన యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Zee High School Management Sent Back Home Student For Wearing Hijab: మనది సెక్యులర్ దేశం. ఇక్కడ అన్ని మతాలవారికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ, కొందరిలో మాత్రం ఆ సెక్యులర్ భావనలు లేవు. ఇతర మతస్తులపై విషం చిమ్ముతూ.. ప్రశాంతంగా ఉన్న సమాజంలో దుమారం రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతూ.. ఈ వ్యవహారం ఇప్పుడు పాఠశాలల దాకా కూడా చేరింది. కర్ణాటకలో హిజాబ్ గొడవ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి హిజాబ్ ధరించి స్కూల్‌కి వచ్చిందని, ఆమెను వెంటనే బయటకు పంపించేశారు. దీంతో.. ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Uttar Pradesh : పెళ్లింట్లో విషాదం..నిద్రపోతున్న ఐదుగురిని నరికి.. గన్‌తో కాల్చుకుని సూసైడ్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
హయత్ నగర్‌లో జీ హై స్కూల్ ఉంది. ఇందులో సామియా ఫాతిమా అనే యువతి 10వ తరగతి చదువుతోంది. శనివారం ఈ అమ్మాయి హిజాబ్ ధరించి స్కూలుకి వెళ్లగా.. స్కూల్ యాజమాన్యం ఆమెని ఇంటికి పంపింది. ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయగా.. వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కస్తూరి A1(క్లాస్ టీచర్), పూర్ణిమ A2 (ప్రిన్సిపాల్), మధు శ్రీ A3 (9th class కో ఆర్డినేటర్), కవిత A4 (10th క్లాస్ కో ఆర్డినేటర్)లపై కేసు నమోదైంది. అయితే.. ఈ ఘటనపై స్పందించేందుకు స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. ఒక స్కూల్‌లో హిజాబ్ అంశాన్ని ఎందుకు లేవనెత్తారని ప్రశ్నిస్తే.. ఎవ్వరూ సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు.
Ramya Pasupuleti: బీచ్ ఒడ్డున సాగర కన్యలా రమ్య పసుపులేటి అందాలు
మరోవైపు.. ఈ ఘటనపై విద్యార్థిని సామియా ఫాతిమా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిజాబ్ వేసుకుంటే బయటకు పంపడమనేది మానవ హక్కులను హరించడమేనని పేర్కొంది. సెక్యులరిజం అంటే.. అన్నీ మతాలకు స్వేచ్ఛను ఇవ్వడమని తెలిపింది. కానీ.. స్కూల్ యాజమాన్యం తనపట్ల ఇలా వ్యవహరించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో కూడా ఒక జూనియర్ అమ్మాయి హిజాబ్‌ను బలవంతంగా లాగేశారని తెలిపింది. ఇప్పుడు తన పట్ల కూడా అలాగే చేయడంతో, తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది. ప్రతీ అమ్మాయి ఇలాంటి అంశాలపై ధైర్యంగా మాట్లాడాలని సూచించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!