హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని…
కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నుదుటన సింధూరం పెట్టుకోవడం తనకు ఇష్టమని.. అలాగే హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే నిర్ణయించుకోనివ్వండి.. మాకు నేర్పించకండి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహిళలు సృష్టికర్తలు అని, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని…