Manne Krishank : హైకోర్టు నుండి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన నకిలీ వీడియోల ప్రచారంపై తనను అన్యాయంగా ఆరోపిస్తూ ఈ కేసులు పెట్టారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలను పంచలేదని పిటిషన్‌లో క్రిశాంక్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలో భాగంగా,…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని యత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అటువంటి భూమిని కేంద్ర అనుమతి లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7…
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…
తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన బయ్యా సన్నీ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది, అయితే తదుపరి విచారణను మార్చి 24, 2025కి వాయిదా వేసింది. సన్నీ యాదవ్‌పై మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్…
Bandi Sanjay : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలైంది. అయితే, తగిన ఆధారాల్లేవన్న కారణంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు..
KTR : తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ఇరువురి వాదనలు పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కేసు నమోదు జరిగింది. ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో సరైన…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో 2020 మార్చిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి సహా మరికొందరిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసును ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి తరఫు…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.