KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్ , జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. Top Headlines @5PM : టాప్ న్యూస్ ఈ వివాదానికి నేపథ్యం ఇది – ఇటీవల కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 25…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు.
Bombay High Court: భార్యకు వివాహేత సంబంధం ఉందని ఓ భర్త కోర్టుకెక్కాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చెబుతూ కొన్ని రికార్డింగ్స్‌ని కూడా కోర్టు ముందుంచారు. అయితే, ఈ కేసులో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. భర్త చేసిన వాదనల్ని ధ్రువీకరించడానికి ‘‘వాయిస్ శాంపిల్స్’’ ఇవ్వాల్సిందిగా భార్యని ఆదేశించింది.
High Court: వివాహ సమయంలో వధువుకు బహుమతిగా వచ్చే బంగారు ఆభణాలు, నగదు ఆమెకు సంబంధించిన ఆస్తి అని లేదా దానిని ‘స్త్రీ ధనం’’గా పరిగణించాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి ఆస్తిపై మహిళకు ప్రత్యేక హక్కులు ఉంటాయని చెప్పింది. ఎర్నాకుట కలమస్సేరికి చెందిన ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, ఎంబి స్నేహలతతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి , ఈ తీర్పుని చెప్పింది. విడాకుల తర్వాత పెళ్లి సమయంలో…
ఏపీ అధికారి హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2013లో హైదరాబాదులో మురికి వాడలను కూల్చోద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 80 మంది పోలీసులను పెట్టి ఉత్తర్వులను ఉల్లంఘిస్తారా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మురికివాడలను కూల్చారు నాటి తహసిల్దార్. దీంతో కోర్టు ధిక్కరణ కింద జైలు పాలయ్యారు ఆ అధికారి. విభజన సమయంలో ఈ ఘటన జరిగిందని, అధికారికి పిల్లలు ఉన్నారని వదిలివేయాలని…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.. ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు…
Manne Krishank : హైకోర్టు నుండి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన నకిలీ వీడియోల ప్రచారంపై తనను అన్యాయంగా ఆరోపిస్తూ ఈ కేసులు పెట్టారని, తాను ఎలాంటి ఫేక్ వీడియోలను పంచలేదని పిటిషన్లో క్రిశాంక్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలో భాగంగా,…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని యత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అటువంటి భూమిని కేంద్ర అనుమతి లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7…