ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, దీనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.. దీంతో, ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తారా? అనే అనుమానాలు కలిగినా.. ఇప్పుడా ఆ సస్పెన్స్ కు తెరపడినట్టు అయ్యింది.. ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్…
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్‌పై నిర్ణయాన్ని వీసీకే వదిలేసింది హైకోర్టు.. రెండు రోజుల క్రితం పిటిషన్‌ను పరిశీలించాలంటూ వీసీని ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, వీసీ సెలవులో ఉండడంతో.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. Read Also: Konda Vishweshwar Reddy: బండితో కొండా భేటీ.. బీజేపీలో చేరతారా? కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు… రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.. కానీ, అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్ గాంధీ మీటింగ్‌కి అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది. Read Also: YS Viveka murder…
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై. సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే! ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల వాదనలు పూర్తవ్వగా.. ఈరోజు (బుధవారం) సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి సునీత హాజరయ్యారు. Read Also: Kolkata: చిదంబరానికి నిరసన సెగ.. నువ్వో…
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేయడం జరిగిపోయాయి.. ఇదే సమయంలో ఈ నెల 5వ తేదీలోగా…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ…
వ్యభిచార గృహానికి వెళ్లాలంటే విటులు భయపడిపోతుంటారు. ఎక్కడ పోలీసులు రైడ్ చేస్తారో..? ఎక్కడ మీడియా తమ ఫోటోలను టీవీలో పదే పడే చూపిస్తూ పరువు తీస్తుందో..? ఇంట్లోవారికి తెలిసి గొడవలు అవుతాయో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఆ భయం అక్కర్లేదు. పోలీస్ రైడ్ లో విటులు దొరికినా పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకంటే.. పోలీస్ రైడ్ లో దొరికిన విటులు నేరస్తులు కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై విటులను కస్టమర్‌గా…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది… ఐఏఎస్ అధికారులకు ఈమధ్యే విధించిన సేవా శిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు… కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకుగాను కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సేవా శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన విషయం విదితమే కాగా.. ఈ శిక్షను డివిజనల్ బెంచ్‌లో గత వారం సవాల్ చేశారు.. అందులోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు… దీంతో, సేవాశిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది…