స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు రద్దు చేయాలని ఆమె వేసిన పిటిషను హైకోర్టు తిరస్కరించింది. రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి హిందువులను కించపర్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో ఆమెపై భజరంగ్ దళ్ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గత కొన్నిరోజుల క్రితం ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఆ వ్యాఖ్యలపై సాయి పలలవి వివరాన్ కూడా ఇచ్చింది. తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి అని కోరుతూ సాయి పల్లవి అందరిని క్షమాపణలు కోరింది. అయినా హిందూ సంఘాలు ఆమెపై భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల సుల్తాన్ బజార్ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. ఇక నోటీసులను రద్దు చేయాలని సాయి పలలవి హైకోర్టును ఆశ్రయించింది. నేడు విచారణ జరుపుకున్న ఈ కేసులో సాయిపల్లవికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు రద్దు చేయాలన్న పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది.