తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు నూతన ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామిస్తూ.. సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇవాళ్టి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పనిచేశారు.
అయితే… తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. ఈ మేరకు అధికారిక సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. కాగా…. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గత మూడు నెలల కిందట.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.
►ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి
►హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అంజాద్ సయీద్
►రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే
►గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ
కాగా.. Oct 06, 2021న దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావును పంజాబ్ హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాను, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అయితే.. 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించింది. ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ నియమితులయ్యారు.
WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్ పేరు..