తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ వేదికగా జరిగన ఈ కార్యక్రమంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటు తర్వాత జస్టిస్ భూయాన్ ఐదో సీజే అవుతారు. అయితే.. ఇప్పటివరకు సీజేగా ఉన్న జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 2న 1964సంవత్సరంలో అసోంలోని గౌహతిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. న్యాయవాదిగా 1991లో ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదిగా 2010 సెప్టెంబర్ 6న పదోన్నతి లభించింది. అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా 2011 జూలై 21న కాగా.. ఇక 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 సంవత్సరంలో.. పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు.బాంబే హైకోర్టుకు 2019 అక్టోబర్ 3న బదిలీ అయ్యారు. అయితే.. గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సమర్థత వంతగా విధులు నిర్వహించారు.