డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అనంతబాబు తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందగా.. ఈ నేపథ్యంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా తనకు బెయిల్ మంజూరు చేయాలన్న అనంతబాబు విజ్ఞప్తితో.. 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25 మధ్యాహ్నం తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోవాలని స్పష్టం చేసింది.. ఇక, ఈ మూడు రోజుల పాటు స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రాకూడదని కూడా ఆదేశించింది.. అయితే, బెయిల్ పొడిగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ అనంతబాబు.. దీనిపై సానుకూలంగా స్పందించింది హైకోర్టు.
Read Also: Somu Veerraju: వినాయక చవితి పందిళ్లపై పోలీసుల కర్ర పెత్తనం వద్దు..!
ఎమ్మెల్సీ అనంతబాబుకు తాత్కాలిక బెయిల్‌ను హైకోర్టు పొడిగించింది.. వచ్చే నెల 5వ తేదీ వరకు బెయిల్ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది… తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి తొలుత మూడు రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు.. అయితే, క్రింది కోర్టు ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు అనంతబాబు తరుపు న్యాయవాదులు.. అనంతబాబు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కోర్టు.. బెయిల్ ను మరో 11 రోజులు అదనంగా పొడిగించింది.. క్రింది కోర్టు నిబంధనలను యాథావిధిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.. ఇక, అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పై రేపు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ లో విచారణ జరగనుంది.