Students: హైకోర్టు సీజేకు మాయదార్లపల్లి విద్యార్థుల లేఖ.. మా పాఠశాల మాకే కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థుల లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి గ్రామాలైన మాయదార్లపల్లి.. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి… ఇక, ఆ గ్రామ విద్యార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి.. గత 45 రోజులుగా మాయదార్లపల్లి ఆ గ్రామ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేశారు.. ఈ పరిణామాన్ని నిరసిస్తూ ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టిన విద్యార్థులు.. అయినా తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. దీనిపై సీజేకి లేఖ రాశారు.
Read Also: Raghu Rama Krishna Raju: సర్వే చేయించా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే హవా
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయస్థానం, నేలపాడు, అమరావతి అడ్రస్‌కి ఓ పోస్ట్ కార్డు పంపించారు విద్యార్థులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా? సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.. కానీ, మేం మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు నివసిస్తున్నారు. మేం అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము.
కానీ, మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేం మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం అందుకనే మా ఇంట్లో పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపేస్తున్నారు.. మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు, మా పశువులను, గొర్రెలను మేపడానికి సిద్ధం చేస్తున్నారు. కావున, దయగల మహాప్రభువులు.. మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం.. లేదంటే, మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా, గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకోంది. కావున, తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము. అంటూ రాసుకొచ్చారు విద్యార్థులు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?