గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను సవాల్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజాసింగ్ భార్య.. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మంగళ్‌హాట్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.. రాజా సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం..
Read Also: Record Fined For Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు రికార్డు స్థాయిలో ఫైన్ ..! ఎందకంటే..?
కాగా, గత నెల 25వ తేదీన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పీడీ యాక్ట్ కింద జారీ చేసిన ప్రొసిడింగ్స్‌ను ధ్రువీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1651ను కొట్టివేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య ఉషాబాయి అభ్యర్థించారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని ఆమె పేర్కొన్నారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమని వాపోయారు.. రాజాసింగ్‌పై కేసులున్నాయన్న కమిషనర్, ఇటీవల నమోదైన మూడు కేసులను మాత్రమే చూపించారని.. ఇతర కేసులు చెప్పకుండా ఉత్తర్వులు జారీ చేయడంలో వారి దురుద్దేశం స్పష్టంగా తెలుస్తోందని కోర్టుకు విన్నవించారు.. ఇక, ఈ కేసును విచారించిన హైకోర్టు.. మంగళ్‌హాట్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.. పీడీ యాక్ట్ నమోదు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.