High Court at Rajendranagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ఖరారైంది. బుధవారం హైకోర్టు భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని సమాచారం.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
APPSC Group 1 Main Exam 2018 Canceled: తాజాగా ఏపీ హైకోర్టు 2018 లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేసింది. ఈ పరీక్షలకి సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 22, 2022లో 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అయితే ఇందులో అనుమానాలున్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను…
పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించడంలో కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కోర్టు హెచ్చరికల నేపథ్యంలో బెంగాల్ పోలీసులు ఎట్టకేలకు అతడిని సీబీఐకి అప్పగించారు.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది.
ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల పశ్చిమబెంగాల్లో రెండు సింహాల పేర్లపై తీవ్ర దుమారం చెలరేగింది. ఒకే ఎన్‌క్లోజర్‌లో సీత-అక్బర్ అనే సింహాలను పెట్టడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.