Kejriwal: అరెస్ట్, కస్టడీపై హైకోర్టుకెళ్లిన కేజ్రీవాల్.. ఎమర్జెన్సీ విచారణకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా ఆదివారం లోపు విచారించాలని విజ్ఞప్తి చేశారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఏడు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. తాజాగా ఈ రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమర్జెనీగా 24 గంటల్లో విచారించాలని ఆయన కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు వరసగా తొమ్మిది సార్లు సమన్లు జారీచేశారు. 9 సార్లు ఆయన సమన్లను దాటవేశారు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని.. విచారణ నుంచి స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఇక శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది. తన అరెస్ట్, రిమాండ్ అక్రమం అని కేజ్రీవాల్ పిటిషన్‌లో ఆరోపించారు. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో ఆయన కోరారు.
Also Read
- JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
ఇక లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేజ్రీవాల్ మనీష్ సిసొడియా, కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపించింది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చుతున్నారు. మరీ తాజా పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!