బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
పోక్స్ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యాడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు హైకోర్టులో యాడియూరప్ప పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని.. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.
High Court : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు (transgender persons) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు, అయితే వారికి ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీచర్స్ ఎలిజిబిలిటీ…
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు…
NEET : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.