MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
- ఆసుపత్రి నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్..
- టెస్ట్ లకు అంగీకరించి ఆస్పత్రిలో చేరిన బాధిత మహిళ..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adimulam case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదుచేసిన తెలుగు మహిళా నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వైద్య పరీక్షలకు ఒప్పుకుని ప్రసూతి ఆస్పత్రిలో జాయినయ్యారు. సోమవారం ఉదయం భర్తతో కలసి స్టేషన్‌కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకాలేనని తేల్చి చెప్పారు. దీంతో సీఐ మహేశ్వర్‌రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను రుయాస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానడంతో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయినయ్యారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందన్నారు పోలీసులు..
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
మరోవైపు.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించడం లేదు కుటుంబ సభ్యులు.. సెక్యూరిటీ సిబ్బంది.. ఇప్పటికే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం కేసులో తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు.. ఇక, బాధితురాలు కూడా వైద్య పరీక్షలు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటికే తిరుపతిలోని బీమాస్ పేరడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్‌లు సీజ్ చేశారు.. సీసీ టీవీ ఫుటేజ్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు.. మరోవైపు.. అశ్లీల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. టీడీపీ ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!