TS High Court: జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ.. హైడ్రా విధివిధానాలు స్పష్టం
- జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ
- ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని లాయర్ వివరణ
- ప్రభుత్వ భూములు.. చెరువులు.. నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్న ప్రభుత్వ తరఫు లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.
READ MORE: Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ఇండియన్ ఐడల్లో అదరగొట్టాడు!
Also Read
జన్వాడ ఫార్మ్ హౌస్ లో నిర్మించిన భవనాలకు స్థానిక సర్పంచ్ అనుమతి ఇచ్చారని.. పంచాయితీ తీర్మానం లేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వివరించారు. ఆ భూమి ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉందా? లేదా అన్నది స్పష్టత కావాలని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఈ పిటిషన్ ను ముగించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను జీవో19 ప్రకారం నిబంధనల మేరకే హైడ్రా నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాను సూచించింది.
READ MORE: Bandru Sobharani: కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘాటు వ్యాఖ్యలు!
కాగా.. తాజాగా ఫాం హౌస్ పై కేటీఆర్ మాట్లాడారు. నాకంటూ ఎలాంటి ఫాం హౌస్ లేదని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నా మిత్రుడి ఫాం హౌస్ ను నేను లీజుకు తీసుకున్నానని అన్నారు. ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తా అన్నారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ లను కూల్చాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌస్ నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. నాకు ఎలాంటి ఫాం హౌస్ లేదు.. వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి స్టార్ట్ చేయండి అని డిమాండ్ చేశారు. రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు