బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. కాగా.. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు అని పొగిడారు.
ఈ రోజు ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రసీమ టాలీవుడ్. అయితే అందుకు అనుగుణంగా మన హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చిత్రసీమలో కమిట్ మెంట్ కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది కాగడా పెట్టి వెతికినా కానరాదు. ఎవరికి వారు సక్సెస్ వెంట పరుగులు పెడుతూ అది ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. సక్సెస్ లో ఉన్న వారిని కలుపుతూ క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేసుకుని లాభ…
తెలుగు సినిమా హిట్ అయిందో? లేదో తెలియాలంటే ఒకప్పుడు నంబరాఫ్ డేస్, సెంటర్స్, కలెక్షన్స్ ప్రామాణికంగా ఉండేవి. అయితే కాలక్రమేణా సినిమాల రన్ తగ్గి వసూళ్ళు క్రైటీరియాగా మారాయి. దాంతో ఇప్పుడు కలెక్షన్స్ రికార్డుల ముచ్చటే సాగుతోంది. ఇక ఇప్పుడైతే ఏకంగా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసింది… వీకెండ్ లోపు ఎంత వసూలు చేసింది.. ఇదే ప్రధానంగా మారింది. అసలు సినిమాకు క్రేజ్ రావాలంటే ఏం చేయాలనే విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. క్రేజీ…
(మే 8న మదర్స్ డే సందర్భంగా…) తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రల్లో అలరించిన వారెందరో ఉన్నారు. వారిలోనూ చిత్రవిచిత్రంగా సాగిన వైనమూ కనిపిస్తుంది. తమ కంటే వయసులో ఎంతో పెద్దవారయిన నటులకు అమ్మలుగా నటించి ఆకట్టుకున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు హీరోల సరసన నాయికలుగా నటించి, తరువాతి రోజుల్లో వారికే తల్లులుగా నటించి మెప్పించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తల్లిగా నటించిన వారితో తరువాత నాయకులుగా నటించిన వారూ లేకపోలేదు. ఇలా చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో…