ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత వారం హస్తిన పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ పలువురి ప్రముఖలను కలిశారు. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు.
Jharkhand Floor Test: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి హేమంత్ సోరెస్ ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. హేమంత్‌చే ప్రమాణం చేయించారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జూలై 4న మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. జనవరి 31న అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.
Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జనవరిలో హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఇటీవల జార్ఖండ్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆరోపించిన విధంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని హైకోర్టు వ్యాక్యానించింది.
Hemant Soren: ఇవాళ (బుధవారం) రాంచీలో జరగనున్న అధికార ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఖాయం అని మంత్రి సత్యానంద్ భోక్తా ప్రకటించారు.