Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్..
- సోరెన్‌ను జనవరి 31న అరెస్టు చేసిన ఈడీ
- భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్
- హేమంత్ కు బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
- మరోసారి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సోరెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి లభించింది. ఈరోజు హేమంత్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అంతకుముందు ఉదయం హేమంత్ సోరెన్ కూటమిలో చేరిన కాంగ్రెస్ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.
READ MORE: Niharika NM : నక్క తోక తొక్కిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ సినిమాతో?
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
జార్ఖండ్ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడైన హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తన అరెస్టుకు కొద్దిగంటల ముందే నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. తాజాగా చంపాయి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం హేమంత్ బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు. దీంతో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా.. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేయడానికి ఈడీ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!