Amit Shah: గిరిజనులపై ‘‘లవ్ జిహాద్’’, ‘‘ల్యాండ్ జిహాద్’’.. సీఎం గిరిజనుడై ఉండీ వీటికి మద్దతు..
- జార్ఖండ్‌లో లవ్ జిహాద్‌కి సీఎం మద్దతు..
- రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
- అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల హక్కులపై శ్వేతపత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, గిరిజనులను కాపాడేందుకు వారి భూములు- రిజర్వేషన్లు- హక్కులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని శనివారం పేర్కొన్నారు.
Read Also: Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
వేలాది మంది చొరబడి గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకుంటూ, సర్టిఫికేట్లు పొంది వారి భూములను కొనుక్కుంటున్నారని, రాబోయే రోజుల్లో గిరిజనుల సంఖ్య తగ్గతుందని అమిత్ షా అన్నారు. ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయి ఉండీ రాష్ట్రంలో ‘‘ల్యాండ్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ కి మద్దతు ఇస్తున్నాడని, జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనతో పాటు ఇండియా కూటమి, కాంగ్రెస్ నాయకులు వారి ఓటమిని అంగీకరించలేకపోతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 81 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే 52 సెగ్మెంట్లలో కమలం వికసించిందని, వచ్చే ఎన్నికల్లో్ బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నేతలు బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని, దేశభద్రతతో ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతలు ఆడుకుంటున్నారని ఆరోపించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, ఇది దిగిపోవాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి, లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, అర్జున్ ముండా సహా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
#WATCH | Speaking at the Jharkhand BJP working committee meeting in Ranchi, Union HM Amit Shah says, "A tribal CM instead of worrying about the tribals is disturbing the balance of land and population by doing 'land jihad' and 'love jihad'. Thousands of infiltrators marry tribal… pic.twitter.com/0m8MyL9XdE
— ANI (@ANI) July 20, 2024
తాజావార్తలు
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!