మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు లో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రెస్క్యూ టీం ఎంతో మందిని కాపాడి సురక్షితమయిన ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా వేలాది మంది రోడ్డున పడ్డారు.కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో ఎదురు చూస్తున్నారు.ప్రభుత్వం సహాయక చర్యలు…
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మానవత్వాన్ని చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట ప్రాంతవాసి కార్మిక నాయకుడు, వెంకటరమణ అనారోగ్యంతో పదిరోజుల క్రితం మృతి చెందాడు. కాగా ఆయన బ్రతికుండగానే ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోగా, ఆమెకు ఒక చిన్న కూతురు ఉంది. దీంతో ఆ చిన్నారి పరిస్థితి చూసి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చిన్నారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని చిన్నారిని చదివించి ప్రయోజకురాలిని చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ…