మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు లో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రెస్క్యూ టీం ఎంతో మందిని కాపాడి సురక్షితమయిన ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కోలుకుంటోంది.
భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా వేలాది మంది రోడ్డున పడ్డారు.కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో ఎదురు చూస్తున్నారు.ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జనాలు ఆకలి బాధలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వచ్ఛంద సేవకులు చెన్నై వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఇక సెలెబ్రేటిలు కూడా తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. తమ అభిమానులను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా తన వంతుగా సాయాన్ని అందించింది.
తన సంస్థ ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు మరియు ఫుడ్ ప్యాకెట్లు అందించారు. దీంతో నయన తారపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం లేడీ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఫెమీ 9’ కంపెనీకి చెందిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉన్న ప్రత్యేక వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడమే నెటిజన్ల విమర్శలు చేయడానికి కారణం. దీనికి సంబంధించిన వీడియోను ‘పెమీ 9’ కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. వీడియో చివర్లో, స్థానిక మహిళలు కొందరు నయనతారకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు.. మహిళలను బలవంతంగా పెట్టి సీన్ చిత్రీకరించారని వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు కంపెనీని ప్రమోట్ చేస్తున్నారా అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. అయితే చాలా మంది నయనతార చేసిన సాయాన్ని మెచ్చుకుంటున్నారు.
https://www.instagram.com/reel/C0hPJgtyPSc/?igshid=MzRlODBiNWFlZA==