తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.. రేపు, ఎల్లుండి జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. వాయిదా పడిన పరీక్షలు మరల ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇక, భారీ వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.. మరోవైపు.. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో.. మరోవైపు ఇంకా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. రేపు (28వ తేదీ) రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం.. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇవ్వడం జరిగిందని ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్.