హైదరాబాదీలకు అలర్ట్.. 5, 6 గంటలు అతి భారీ వర్షాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.. తెలంగాణలో రెడ్ అలర్ట్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదైందని వెల్లడించారు.
రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.. హైదరాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలో ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ఇక, గులాబ్ తుఫాన్ తీరాన్ని తాకి బలహీన పడిందని.. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని.. క్రమంగా బలహీన పడి అల్పపీడనంగా మారొచ్చు అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తుండటం కారణంగా హైదరాబాద్ పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉందన్నారు నాగరత్న.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు