మండు వేసవిలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు రుతుపవనాల ప్రభావం వల్ల వానలు పడుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వానపడింది. జిల్లాలో పలు చోట్ల వడ గళ్ళ వర్షం కురిసింది. నెన్నల్ మండల కేంద్రంలో చెరకు తోటలో పిడుగు పడి భారీగా మంటలు చెలరేగాయి. నష్టం భారీగా వుంటుందని సమాచారం. అలాగే, వేమనపల్లి మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. భారీవర్షానికి పలుప్రాంతాల్లో ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. ఇటు…
నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట,…
కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో…
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నది ప్రవాహం పైన బ్రిడ్జి పాడైంది. ఒకవైపు అసనీ తుఫాన్ ప్రభావం వల్ల, గతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల అధిక బరువు గ్రానైట్ లారీలు ప్రయాణం చేయడం వల్ల బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. శరవేగంగా కుంగిన వంతెన శ్లాబ్ తొలగింపు పనులు సాగుతున్నాయి. వంతెన కుంగిపోవడంతో అధికారులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వాహనదారులు…
అసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్‌గా మారింది. దిశను మార్చుకున్న అసని మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా విశాఖకు రావాల్సిన, వెళ్లాల్సి ఉన్న అన్ని విమానాలను…
ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు ఒంగోలు కలెక్టరేట్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు. అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం…
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా…
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఒక్క రాత్రిలో నీటిపాలైంది. వరుణుడి ధాటికి రైతన్న లబోదిబోమంటున్నాడు. బుధవారం వేకువజామున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసింది. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో వరిధాన్యం కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో సరిపడ టార్ల్పిన్ కవర్లు లేకపోవడంతో వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకోయింది. దీంతో రైతన్నలు కన్నీరు కార్చుతున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రాక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలు.. ఇప్పుడు వర్షా ధాటికి ఎంతో…