చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో…
అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150…
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల…
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర…
ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి… తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని అంటున్నారు వాతావరణ…
ఇవాళ రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాదు… ప్రాజెక్టు పరిసర గ్రామాల…
తిరుమల రెండో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేసింది టీటీడీ పాలక మండలి. 14వ కిలో మీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. 16 వ కిలో మీటర్ వద్ద భారీ కోతకు గురైంది రోడ్డు. అలాగే…. 14వ కిలో మీటర్ వద్ద కొండచరియలు తొలగింపు పూర్తి అయితే… లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లింపు చేపట్టే అవకాశం ఉండనుంది. 16వ కిలో మీటర్ వద్ద మరమత్తులకు నెలల…
వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టమే జరిగింది.. నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. మరో తుఫాన్ తీరంవైపు దూసుకొస్తోంది.. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.. అది రేపటికి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ – ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు… ఈనెల 3వ తేదీన అది తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత 24 గంటల్లో…
ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్ర…