మండు వేసవిలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు రుతుపవనాల ప్రభావం వల్ల వానలు పడుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వానపడింది. జిల్లాలో పలు చోట్ల వడ గళ్ళ వర్షం కురిసింది. నెన్నల్ మండల కేంద్రంలో చెరకు తోటలో పిడుగు పడి భారీగా మంటలు చెలరేగాయి. నష్టం భారీగా వుంటుందని సమాచారం. అలాగే, వేమనపల్లి మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. భారీవర్షానికి పలుప్రాంతాల్లో ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి.
ఇటు గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలుకలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో భారీవర్షం కురిసింది. సిరోంచాలోని రామంజపూర్ పెట్రోల్ బంక్ వద్ద బైక్‌లు కొట్టుకుపోయాయి. పెట్రోల్ బంక్ పై భాగం రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా విరిగి పడ్డ చెట్లతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదిలా వుంటే… రానున్న ఐదురోజుల్లో భారతదేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడ్డ సైక్లోన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు, వడగళ్ళ వానలు పడతాయని పేర్కొంది.
Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!