Asani Cyclone: ఏపీలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు ఒంగోలు కలెక్టరేట్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు అసని తీవ్ర తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్‌లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెoబర్లు: 87126 55878, 87126 55881, 87126 55918. అంతేకాకుండా తీర ప్రాంత మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
అసని తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్త పట్నం, టంగుటూరు, నాగులుప్పలపాడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. జరుగుమిల్లి మండలంలో అత్యధికంగా 34 మిల్లీ మీటర్లు, ఒంగోలులో 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తుఫాన్ కారణంగా మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..