Rain Alert In TG: తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేయగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది.
హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో వర్షం పడుతుంది.
నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా, పూణే-సోలాపూర్ హైవే జలమయం అయింది. రోడ్లు నదులను తలపించాయి. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: భారీ వర్షాలు ప్రజల్లో భయానక…
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే, ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Weather Report : దక్షిణ భారతదేశంలో వాతావరణం కీలక మార్పులకు లోనవుతోంది. సాధారణంగా రుతుపవనాల రాకకు సూచికగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇది శుభవార్తే అయినా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం పశ్చిమ తీరం వెంబడి విస్తృత వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది. కేవలం అరేబియా సముద్రంలోనే కాకుండా, ఈ నెల…
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా వేసవి పూర్తి కానేలేదు అప్పుడే వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి.. ఆవర్తనం కొనసాగుతున్నాయి. ద్రోణి.. ఆవర్తనలా ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. Also Read:Andhra Pradesh: కువైట్ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం రాష్ట్ర వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి…
రైతులకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే పలకరించబోతున్నాయి.. కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి.. మరోవైపు, రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది..
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండాల్సిన సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు వానలు దంచికొడుతుంటూ.. మరోవైపు ఎండలు బంబేలిస్తున్నాయి.. ఇక, రానున్న రెండు రోజుల్లూను.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.