రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా వేసవి పూర్తి కానేలేదు అప్పుడే వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి.. ఆవర్తనం కొనసాగుతున్నాయి. ద్రోణి.. ఆవర్తనలా ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
Also Read:Andhra Pradesh: కువైట్ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం
రాష్ట్ర వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్ల కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.