ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో.. ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేశారు.. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు..
వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ఈరోజు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇక, ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..
Heavy Rains: విజయవాడ నగరంలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యంత వేడితో చెమటలు కక్కిన బెజవాడ ప్రజలకు ఊరట లభించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. దీంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లలోకి ప్రభుత్వం పరిహారం సాయం అందజేసింది.