Heavy Rains in Andhra Pradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో.. ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేశారు.. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.. పోలీసు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలి.. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలి.. ఈదురగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి.. భారీ వర్షాలు ప్రభావంతో పొంగిపొర్లే రోడ్లు వెంటనే మూసివేయాలని సూచించారు.
Read Also: CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ఫాక్స్‌కాన్ పనుల పురోగతిపై సమీక్ష
ఇక, ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. శిధిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండే వారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు.. సూచించారు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా.. అర్బన్ ఫ్లడ్ వలన రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా ముందుగానే డ్రైనేజీ, నాళాలు శుభ్రం చేయాలని పేర్కొన్నారు.. కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్ వాళ్లు ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా.. కాగా, ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మంత్రులు.. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వర్షప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు.