Heavy Rain: నేడు, రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- తెలంగాణ రాష్ట్రంలో నేడు- రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
- గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు వీచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు లానినో ప్రభావంతో భారీగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవల వర్షం కురిసింది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో అనుబంధ ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంపై స్థిరమైన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో 123.3, సూర్యాపేట జిల్లా టేకుమట్‌లో 56.5, ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్‌లో 46, వరంగల్ జిల్లా ఏనుగల్‌లో 45, సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Deputy CM Pawan Kalyan: నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్..
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..