CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. కలెక్టర్లు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
- ఏపీకి భారీ వర్ష సూచన..
- ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
- జిల్లా కలెక్టర్లు.. మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
- కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తెల్వారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. ఇక, నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..
Read Also: Rail Bomb Threat: టైమర్ బాంబుతో పేల్చేస్తామంటూ.. ముంబై – హౌరా మెయిల్‌కు బెదిరింపులు
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఇక, టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.. పర్యవేక్షణ ఉంచాలి. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి.. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు.. చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలి.. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి.. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలి.. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని తెలిపారు..
Read Also: Jharkhand: జార్ఖండ్‌లో దారుణం.. దుర్గాపూజకు వెళ్లి వస్తున్న ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం..
సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని సీఎంకు తెలియజేశారు అధికారులు.. ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు.. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు..
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!