Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రభావం..
- తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు..
- హైదరాబాద్‌ను వీడని వరుణుడు..
- రెండురోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి ప్రబావంతో.. ఇరురాష్ట్రాల్లోనూ పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ను అయితే వరుణుడు వీడడంలేదు. ఎప్పుడూ ఏదో ఓ ప్రాంతాన్ని భారీ వర్షం కుమ్మేస్తోంది. ఇప్పుడు ద్రోణి ప్రబావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు..నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నారాయణపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.
Read Also: MS Dhoni: ఓడినా, గెలిచినా.. అతడు తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు: ధోనీ
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే రెండురోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలోనే అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం మిగిల్చాయి. అందుకే అక్టోబర్ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్ హుద్, అంపన్ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!