హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
దక్షిణ తైవాన్‌ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.
Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన పర్యావరణ విపత్తుపై వర్క్‌షాప్ నిర్వహించారు. విపత్తు జరిగిన రోజు అక్కడ విపరీతమైన గాలులు, భారీ వర్షం ఒకే చోట కురవడం వలన కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది. NRSC, NARLకి చెందిన శాస్త్రవేత్తలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి వాయుగుండం సంభవించడం వలన ఇక్కడ గంటకు 130-140 కిలోమీటర్లు వేగంతో గాలి వీచిందని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి.
ఉత్తర జపాన్‌పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.