Hyderabad Rains: రోడ్లను ముంచిన వరద.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు..
- హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది..
- సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. నిన్న(శనివారం) సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మురికివాడలు, కాలనీల్లోనే కాదు ఇళ్లలోకి వరద పోటెత్తింది. ఖైరతాబాద్‌లోని ఎంస్మక్తా, బేగంపేట బ్రాహ్మణివాడి, లంగర్‌హౌస్, యూసుఫాగూడ శ్రీకృష్ణానగర్ బి-బ్లాక్, లక్ష్మీనర్సింహనగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వాసులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాత్రి 9 గంటల వరకు లంగర్‌హౌస్‌లో 9.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ స్టాటిస్టిక్ భవన్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యతో ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి పడుకునే సమయంలో వర్షం కురవడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు పూర్తిగా తడిసి ముద్దయ్యారు.
CLP Meeting: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
Also Read
- Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
- Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!