Water Leakage At Taj Mahal: దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది.
విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో…
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా చోలాస్ గ్రామంలో ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. భారీ వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.
మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు…
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Mahabubabad Rain: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు, రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.