ఏప్రిల్‌తో వేసవి తాపం కూడా మొదలైంది. వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మండుతున్న ఎండలకు, ఎండలకు బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఇటీవల, భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఏప్రిల్, జూన్ మధ్య అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సురీడు సుర్రుమంటున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. భానుడు భగభగమండిపోతున్నాడు.
Summer Heatwave: ఈ ఏడాది వేసవి మరింత హాట్‌గా ఉండబోతున్నట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్‌సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.
మెక్సికో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్)కి చేరుకోవడంతో వేడి సంబంధిత కారణాల వల్ల మెక్సికోలో గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Highest temperature: అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో రాబోవు మూడు రోజుల పాటు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. రేపు 136 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఎల్లుండి 153 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ఇప్పటికే ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రభావిత…
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Heatwave Conditions: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, రేపు కూడా వీటి ప్రభావం కొనసాగనుంది.. ఐఎండీ అంచనాల ప్రకారం.. రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు.. ఇక, రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న…