Heatwave Conditions: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, రేపు కూడా వీటి ప్రభావం కొనసాగనుంది.. ఐఎండీ అంచనాల ప్రకారం.. రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు.. ఇక, రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు నాలుగు ఉండగా.. అందులో అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Also: Fake Currency in ATM: ఏటీఎంలో నకిలీ నోట్ల కలకలం.. ఫేక్ కరెన్సీ డిపాజిట్
మరోవైపు.. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 126 మండలాల విషయానికి వెళ్తే.. అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్ 14, పల్నాడు 1, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్ 3 మండలాల్లో
వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, మంగళవారం అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీసాయి.. అల్లూరి 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.