Bengaluru: వర్షాభావ పరిస్థితులు, నీటి కొరతతో సతమవుతున్న బెంగళూర్ నగరాన్ని ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు వేధిస్తున్నాయి. నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. నీటి సంక్షోభం మధ్య, ప్రస్తుతం నగరంలో వడగాలులు, ఉష్ణోగ్రతలు ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నగరంలో మార్చి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) ప్రకారం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతల పెరుగుదల అసాధారణంగా ఉందని, గత ఏడేళ్లలో ఈ ఏడాది రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. మార్చి 28, 2024న బెంగళూర్‌లో ఏకంగా 37.9 డిగ్రీ సెల్సియస్‌కి ఉష్ణోగ్రత చేరుకుంది. గతేడాది ఇదే రోజు 37.5 డిగ్రీలుగా ఉంది.
Read Also: karnataka: జేడీఎస్ అభ్యర్థుల ప్రకటన.. కుమారస్వామి ఎక్కడి నుంచంటే..!
ఈ ఆకస్మిక ఉష్ణోగ్రతలకు అనేక అంశాలు దోహదపడుతున్నాయి. రుతుపవనాలకు ముందు ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, వేగవంతమైన పట్టణీకరణ, పెరిగిన కాంక్రీట్ నిర్మాణాల కారణంగా ఏర్పడే అర్బన్ హీర్ ఐలాండ్ ప్రభావం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల నివాసితులు ఇంట్లోనే ఉండాలని, తగినంత నీరు తీసుకోవాలని హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని, సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం మరియు తేలికైన, శ్వాసక్రియకు అనువుగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం మరియు తేలికైన, శ్వాసక్రియకు అనువుగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని KSNDMC కోరింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో బెంగళూర్ నగరంలో నీటి సంక్షోభం మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు నీటి దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటున్నారు. నీటిని వృథా చేసినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు రుతుపవనాలు రావాలంటే మరో రెండు నెలలు ఉండటంతో బెంగళూర్ వాసుల కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా కనిపించడం లేదు.