దేశ రాజధాని ఢిల్లీని నిన్నామొన్నటి దాకా దుమ్ము తుఫాన్ హడలెత్తించింది. ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్నటి నుంచి వేడి గాలులు తీవ్రమయ్యాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు
Weather Updates : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21…
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తర భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి…
ఈ ఏడాది హజ్ యాత్రలో అనారోగ్యం, గరిష్ట ఉష్ణోగ్రతలు తదితర కారణాల వల్ల సుమారు 1300 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో ఈసారి హజ్యాత్రకు భక్తులు తరలివచ్చారు. గతేడాది 16 లక్షల మంది వస్తే ఈ ఏడాది 18 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడం తో 50 డిగ్రీలపైగ ఎండలు హజ్ యాత్రికులకు శాపంగ మారింది మరణించిన ప్రతి 5 మందిలో 4 మంది…
భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. వర్షాకాలంలో భయంకరమైన వేడి గాల్పులుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఒక పక్క వర్షాలు లేకపోవడంతో మరొక పక్క ఎండలు మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం లేదు. ఇప్పటికే ఎండలు ప్రభావంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హీట్ స్ట్రోక్…
తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నప్పటికీ ఉక్కపోత కొనసాగుతోంది. రాబోయే 4-5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలలో భానుడు భగభగమంటున్నాడు. వడగాల్పులతో ఉత్తర భారతమంతా వేడెక్కుతోంది. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వేడి తీవ్రతతో అవస్థలుపడుతున్నారు. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 17 వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, నాసిక్, రాజస్థాన్ మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి, ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బావులు ఎండిపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. కొన్ని…