ఎండలు మండిపోతున్నాయి. మద్యం ప్రియులకు వేడి గట్టిగా తగులుతోంది. దీంతో.. లిక్కర్ నుంచి బీర్ల వైపు మనసు మళ్లుతుంటారు. బీర్ కూల్ అవ్వకముందే.. ఫ్రిడ్జిలో నుంచి తీసి ఇచ్చేయ్యాల్సిందే. అయితే బీర్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్
డైలీ బీరు తాగడం వల్ల బరువు పెరుగుతారని తద్వారా ఊబకాయం తదితర సమస్యలు వేధిస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. 2015లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ బీరు తాగితే బరువు పెరుగుతారని తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో న్యూ యార్క్ నగరంలోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ఆఫ్ న్యూట్రిషన్ డాక్టర్ డేవిడ్ జె. లూడ్విగ్ పాల్గొన్నారు. ఈ పరిశోధనలో 1,000 మందికి పైగా పురుషులు, మహిళలపై 4 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. బీరులో ఎక్కువగా ఉండే కేలరీల వల్ల బరువు పెరుగుతారని పరిశోధకులు తేల్చారు.
READ MORE: Kunal Kamra: మద్రాస్ హైకోర్టులో కునాల్ కమ్రా పిటిషన్.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థన
మన శరీర అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. అయితే ఎక్కువగా బీరు తాగడం కాలేయం చెడి పోవడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం.. రోజూ బీరు తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయని.. ఇవి హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయని సూచిస్తున్నారు. నిత్యం బీరు తాగితే కంటి నిండా నిద్ర కరవవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ ప్రకారం.. రాత్రి నిద్ర పోయే ముందు బీరు తాగితే సరిగ్గా నిద్ర పట్టదని.. నిద్రకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.