ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91శాతం పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసమని, దేవుడి పూజలో పాల్గొనందున అడపాదడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు.. బరువుతగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల గుండెపోటు మరణాలకు దారితీస్తుందనే అధ్యయన నివేదికపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
YCP Bus Yatra Schedule: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
మరోవైపు.. కాలపరిమితితో కూడిన ఆహారం క్యాలరీలను తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయిన్ తెలిపారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో.. షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన విక్టర్ జాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు సుమారు 20,000 మంది పాల్గొని డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 2003 నుంచి 2019 వరకు మరణాల డేటా, పలు అంశాలకు సమాధానాలను పరిశీలించింది. రెండు రోజుల క్రితం ఏం తిన్నారనేది తెలుసుకోవడం కోసం ప్రశ్నావళిలో భాగం చేశారు. అయితే.. ఇందులో లోపాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మంది పురుషులు ఉన్నారు. వారి సగటు వయస్సు 48 ఏళ్లు.
Bachhala Malli : సరికొత్త కథాంశంతో వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి..
ఈ అధ్యయనంలో.. అడపాదడపా ఉపవాసాన్ని ఎంతకాలం కొనసాగించారనేది స్పష్టంగా తెలియనప్పటికీ వారు దానిని అనుసరించారని పరిశోధకులు భావించారని పరిశోధకుడు జాంగ్ తెలిపారు. అయితే.. ఉపవాసం ఉన్న వారిలో అధికంగా బీఎంఐ, ఆహార అభద్రత కలిగిన యువకులు ఎక్కువగా ఉన్నారు… ఈ నివేదికల ఆధారంగా వారికి రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తక్కువగా ఉంది… డేటా విశ్లేషణలో అన్ని అంశాలను మేము నియంత్రించాం.. అయితే ఆహారం తీసుకునే వ్యవధిని 8 గంటలకు పరిమితం చేయడం, గుండెపోటు మరణాల మధ్య సానుకూల సంబంధం ఉంది’ అని జాంగ్ తెలిపారు.