Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshya Raichandani Said I Want to Play CSK in IPL: అండర్-19 ఆసియా కప్ 2026లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ లక్ష్య రైచందాని తన ఐపీఎల్ కలను బయటపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తరఫున ఆడాలని కోరుకుంటున్నావని అడగ్గా.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పేరును చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) కాకుండా సీఎస్కేను ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లక్ష్య 101 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆసియా కప్ విజయానంతరం క్రిక్ఇన్ఫోతో జరిగిన ఇంటరాక్షన్‌లో లక్ష్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్లో ఏ జట్టు తరఫున ఆడాలని అనుకుంటున్నావని అడగ్గా.. ఏమాత్రం తడుముకోకుండా చెన్నై సూపర్ కింగ్స్ అని సమాధానమిచ్చాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ సీఎస్కేను ఎంచుకోవడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే ఇంటరాక్షన్‌లో మైదానంలో తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా లక్ష్యకు ఎదురైంది. విరాట్ కోహ్లీలా దూకుడుగా ఉంటావా? లేక ఎంఎస్ ధోనీలా ప్రశాంతంగా ఉంటావా? అని అడిగారు. దీనికి అతడు ధోనీ తరహా ప్రశాంతమైన ఆటతీరును ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. ఒత్తిడిలోనూ సంయమనం పాటించే ధోనీ నాయకత్వ శైలితో తనను పోల్చుకోవడం విశేషం.
Also Read
- IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
- IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
- IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
- IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!
లక్ష్య ఆటతీరుపై ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ మనీష్ ఝా కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతడు సెంచరీ చేసినా పెద్దగా సంబరాలు చేసుకోడని, సున్నాకే ఔటైనా కంగారుపడడని చెప్పాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటాడని తెలిపాడు. ‘ధోనీ కూడా మైదానంలో ఎక్కువగా భావోద్వేగాలు ప్రదర్శించేవాడు కాదు. లక్ష్య కూడా అంతే. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. వికెట్ పడినప్పుడు కూడా పెద్దగా హడావుడి చేయడు’ అని కోచ్ వివరించాడు. లక్ష్య మైదానంలో ఎక్కువగా మాట్లాడకపోయినా.. కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటాడని మనీష్ ఝా వెల్లడించాడు. జట్టులో తన ఆటతోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తాడని ప్రశంసించాడు. ధోనీని అభిమానించే ఈ యువ కెప్టెన్ భవిష్యత్తులో చెన్నై జెర్సీ ధరించే అవకాశం దక్కించుకుంటాడా? లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!