Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా లండన్ ఆసుపత్రిలో మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పిలువబడే ఆయన 1950లో కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలంగాణలో అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు.…
Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత…
Arogyasri: తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి (సెప్టెంబర్ 16) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్ వదిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల…
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం అని అన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈరోజు విజయవాడలో మంత్రి సత్యకుమార్…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు.
శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం పాదాలు. మన శరీర బరువును మోసి మనం కదలడానికి, నడవడానికి ఉపయోగపడే పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి అప్పుడప్పుడు పాదాలు తిమ్మిరెక్కుతాయి. అది మామూలే కానీ తరచుగా పాదాలు తిమ్మిరి పట్టడం కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలు నిరంతరంగా లేదా తరచుగా తిమ్మిరిగా ఉండటం మధుమేహం, విటమిన్ లోపాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, పరిధీయ ధమని వ్యాధి, సయాటికా…
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే ఏ శాఖకు ఎంత బడ్జెట్ అన్న…
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు సంవత్సరాలపాటు భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.