శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం పాదాలు. మన శరీర బరువును మోసి మనం కదలడానికి, నడవడానికి ఉపయోగపడే పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి అప్పుడప్పుడు పాదాలు తిమ్మిరెక్కుతాయి. అది మామూలే కానీ తరచుగా పాదాలు తిమ్మిరి పట్టడం కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలు నిరంతరంగా లేదా తరచుగా తిమ్మిరిగా ఉండటం మధుమేహం, విటమిన్ లోపాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, పరిధీయ ధమని వ్యాధి, సయాటికా లేదా స్ట్రోక్ వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. అలాగే పాదాల ఆరోగ్యం గురించి పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు మనలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.
1. చాలామంది పాదాల్లో వాపు ఉంటుంది. ఎక్కువ సేపు నిలబడటం, లేదంటే అలసిపోవడం వల్ల వాపు రావడం సాధారణం. కానీ ఈ వాపు ఎక్కువ రోజుల పాటు ఉంటే కచ్చితంగా జాగ్రత్త పడాలి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ రుగ్మతలు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కాళ్లల్లో వాపు కనిపిస్తుంది. కనుక వెంటనే కాళ్లల్లో వాపులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది.
2. చాలామంది అరికాళ్ళు చల్లబడుతూ ఉంటాయి. ఇలా అరికాళ్ళు చల్లబడడం ఏమాత్రం మంచిది కాదు. పాదాల జలదరింపు, తిమ్మిరి ఇది రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడానికి సంకేతం. అధిక రక్తపోటు గుండె జబ్బులతో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు రక్తహీనత థైరాయిడ్ సమస్యల వల్ల కూడా పాదాలు చల్లబడే అవకాశం ఉంటుంది. ఏదో వేడికి అలా చెమట పడుతుంది.. అని లైట్ తీసుకోకుండా ఒక్కసారి చెక్ చేయించుకోండి.
3. కళ్ళ నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువగా నడవడం, ఎక్కువసేపు కూర్చోవడం ఇలాంటప్పుడు నొప్పి రావడం కామన్ కానీ, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లేదా నరాల వాపుతో పాదాల నొప్పి రోజుల తరబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాదాల చర్మం రంగు మారడం, పొడి బారడం, దురద వంటి లక్షణాలు అనేక వ్యాధులకు సంకేతంగా చెప్పవచ్చు. డయాబెటిస్ రోగులలో కూడా పాదాల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్ రావడం, చర్మంలో మార్పులు సంభవించడం సంభవించవచ్చు.
4. అనారోగ్య సమస్యలను సూచించే ముఖ్యం అయిన లక్షణాలు అంటే.. కాలి గోళ్ళ రంగు మారడం, మందంగా మారడం, విరిగిపోవడం వంటి సమస్యలు కూడా మన శరీరంలోని ఇతర అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. పాదాలపై గాయాలు అయితే పుండ్లు మానకపోవడం, డయాబెటిస్ తో వచ్చే అతి పెద్ద ప్రమాదం. తరచుగా కాళ్ళ కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కూడా మన శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలను సూచించే లక్షణాలు. కనుక ఇలాంటి సమస్యలు అసలు నిర్లక్ష్యం చేయొద్దు.
5. శరీరానికి అవసరమైన విటమిన్ B12 తగినంతగా అందకపోతే అది నరాల సమస్యలకు దారితీస్తుంది, ఇది కాళ్ళలో తిమ్మిరికి కారణమవుతుంది. ఆరోగ్యకరమైన నరాలను నిర్వహించడంలో విటమిన్ బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు తగినంత తినకపోతే, మీరు వణుకు, కండరాల బలహీనత , తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. ఈ విటమిన్ లోపాన్ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా లేదా అవసరమైతే, వైద్యుడి సలహాతో సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.