Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్‌లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు.…
CDSCO: కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, 135 మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి. ఈ మందులలో గుండె, షుగర్, కిడ్నీ, రక్తపోటు, యాంటీబయాటిక్స్ వంటి వివిధ వ్యాధులకు వాడే మందులు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మందుల తయారీ కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. ఈ మందులలో ప్రధానంగా షుగర్, మైగ్రేన్ వంటి వ్యాధులకు ఉపయోగించే…
Ponnam Prabhakar : అమీర్ పేట్ CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు, రోగులు, రోగుల బంధువులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్పిటల్‌కి ప్రతిరోజూ వస్తున్న ఓపీలు ఎన్ని, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని, ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూతులు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ సూపరిండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలాజీ విభాగాన్ని పరిశీలించారు.. ప్రభుత్వ హాస్పిటల్…
Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ…
నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివ్రుద్ది చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగాలాండ్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ అందులో భాగంగా ఈరోజు (మంగళవారం) మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
Skill University Admission: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.