తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో…
సుమారు 70 ఏళ్ల క్రితం మనిషి సగటు ఆయుర్ధాయం 45 ఏళ్లుగా ఉండేది. అప్పట్లో ఆరోగ్యవంతమైన ఫుడ్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో మనిషి ఆయుర్ధాయం తక్కువగా ఉన్నది. ఆ తరువాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అన్ని రోగాలను మందులు, వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మహమ్మారుల నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. దీంతో మనిషి సగటు ఆయుర్ధాయం ఇప్పుడు 70 ఏళ్లకు పెరగింది. 2100 సంవత్సం వచ్చే సరికి మనిషి ఆయుర్ధాయం…
కరోనా బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో… బూస్టర్ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్ అండ్ మ్యాచ్ వద్దని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. మూడో డోసుల విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు 2లక్షలకు చేరువలో వున్నాయి.…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని,…
బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలి. ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…
తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. Read Also: సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:★ చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు,…
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాలు తెలిసినప్పటికీ పొగతాగడం మానడం లేదు. పొగ తాగడం వలన ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. శ్వాససంబంధమైన జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక, పొగతాగడం వలన గుండెసంబంధమైన జబ్బులు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదు. గుండెజబ్బులతో పాటు, క్యాన్సర్ వంటివి కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంచితే కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు…
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. ధూమపానం చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా పాడైపోతుంది. ఫ్యాషన్ మోజులో పడి యువత సిగరేట్ కాలుస్తూ ఆరోగ్యాన్ని, విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2008 వ సంవత్సరం తరువాత పుట్టిన వారు స్మోకింగ్ చేయకుండా చట్టాన్ని చేసింది. Read: బాలినో భళా… మూడేళ్ల కాలంలో… ఇప్పుడు సిగరేట్‌లో ఉన్న నికోటిన్ శాతాన్ని కూడా క్రమంగా తగ్గించే చర్యలు…
చలికాలంలో శరీరంతోపాటు చర్మం కూడా వివిధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలామంది నీటిని అంతగా తాగరు. కానీ వేసవిలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో కూడా నీటిని…